పత్తికొండ: దాడిపై మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన కెవిపిఎస్

85பார்த்தது
పత్తికొండ: దాడిపై మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన కెవిపిఎస్
వెల్దుర్తి మండలం రత్నపల్లిలో గురిగింజ హనుమక్కపై జరిగిన అమానవీయ దాడిపై స్పందించి కేసు నమోదు చేయించాలని కోరుతూ సోమవారం ఏపీ మానవ హక్కుల కమిషన్ ను కెవిపిఎస్ జిల్లా బృందం ఆశ్రయించింది. కర్నూలులో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు మాట్లాడారు. రత్నపల్లిలో 4 నెలల క్రితం హనుమక్క పంట భూమిని నాశనం చేసి, అడిగినందుకు విచక్షణారహితంగా దాడి చేశారని, ఇప్పటిదాకా ఎలాంటి కేసును నమోదు చేయలేదన్నారు.

தொடர்புடைய செய்தி