దసరా ఉత్సవాల్లో భాగంగా మద్దికేరలో శనివారం గుర్రాల పార్వేట వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా వస్తున్న ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. దసరా పండుగను పురస్కరించుకుని మూడు వర్గాలకు చెందిన వారు మద్దికెర నుంచి మాజరా గ్రామమైన బొజ్జనాయునిపేట వరకు గుర్రాల పోటీలను నిర్వహించారు. గుర్రాలపై సంప్రదాయ దుస్తుల్లో మందీ మార్బలం వెంటరాగా, వైభవంగా ఊరేగింపుగా వచ్చారు.