ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో నందికొట్కూరు మండలంలోని కోనేటమ్మ పల్లె గ్రామంలో ఎమ్మెల్యే జయసూర్య సోమవారం భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని, తాను కూడా నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దామోదర్ రెడ్డి, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.