నందికొట్కూరు నుంచి పగిడ్యాల వెళ్లే రోడ్డులో గుంతలు పూర్చాలని వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి పి. పక్కిరి సాహెబ్ మరియు డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు డి. బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయా గ్రామాల ప్రజలతో కలిసి రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా, ప్రాణాల ముప్పు ఉండేలా మార్పులు జరిగితే అందుకు బాధ్యత వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.