మంత్రాలయం మండలం కాచాపురంలో 104 సిబ్బంది వైద్యాధికారిణి డాక్టర్ వసంతకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. మూడు నెలలుగా వేతనాలు లభించకుండా కుటుంబాలు పోషించటం కష్టం అని చెప్పారు. 104 సేవలను ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ద్వారా 50,000 రూపాయలతో నిర్వహించాలని కోరారు. డ్రైవర్, డి.ఈ.ఓలకు జి.ఓ 7 ద్వారా వేతనాలు ఇవ్వాలని, 74 మంది సీనియర్ డ్రైవర్లకు స్లాబ్ అమలు చేయాలని తెలిపారు.