భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం పెద్దకడబూరు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు పరమేష్, సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న, సీఐటీయు మండల కార్యదర్శి ఉప్పర ఈరన్న మాట్లాడుతూ భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.