బేతంచర్ల పోలీస్ స్టేషన్ నందు ఆదివారం నాడు మండలంలోని గ్రామాల్లో గల రౌడీ షీటర్లుగా గుర్తింపు పొందిన వ్యక్తులకు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వరరావు కౌన్సిలింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. మార్పు తెచ్చుకొని సుఖ సంతోషాలతో భార్యా పిల్లలతో జీవనం సాగించాలని సీఐ అన్నారు.