ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలం క్షేత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ చేతులమీదుగా అహోబిలానికి జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగా అవార్డును ప్రధానం చేశారు. అహోబిలం దేవస్థానం అధికారి సేతురామన్ కు అవార్డును శుక్రవారం ప్రధానం చేశారు.