ఆదోని డివిజన్ పరిధిలో హోళగుందలోని మండల పరిషత్ కార్యాలయం నందు మండల స్థాయి అధికారులతో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా ప్రగతి నివేదికలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ డివో నాగేశ్వరరావు, తహసిల్దార్ ప్రసాద్ రాజు, ఎంపిడిఓ సుహాసినమ్మ పాల్గొన్నారు.