ఎమ్మిగనూరు మండల పరిధిలోని దేవిబెట్ట గ్రామంలో ప్రభుత్వ స్థలాలను టీడీపీ నాయకులు భూకబ్జా చేస్తున్నారని, సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ఎమ్మిగనూరు తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం వైసీపీ నాయకులు, వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, టిడిపికి చెందిన నాయకులు దేవి బెట్ట గ్రామంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రభుత్వ భూములను స్థలాలను ఆక్రమించుకోవడం ఏంటని ప్రశ్నించారు.