బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెలలో అరేబియాలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. సోమవారం అల్లూరి, మన్యం, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.