నందవరం మండలం గంగవరం గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త కాజా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సచివాలయంలో శుక్రవారం కలిశారు. తన గ్రామం గురించి అడిగిన సీఎంకు, 2009 వరదల వల్ల నష్టపోయిన గ్రామానికి రివర్ ప్రొటెక్షన్ వాల్ నిర్మించాలని కోరారు. ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి గ్రామ అభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నారని తెలిపారు.