ఆత్మకూరు మండల పరిధిలోని వడ్లరామాపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి నాగార్జున, ఐసా నాయకులు విష్ణు వర్ధన్ సోమవారం సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 250 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారని కానీ అక్కడ మౌలిక వసతులు ఏ మాత్రం లేవన్నారు.