మహానంది మండలం గ్రామాల్లోని సచివాలయాల్లో ఆధార్ సేవలను విద్యార్థులు, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో మహబూబ్ దౌలా శనివారం తెలిపారు. మండలంలో ఈనెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నాలుగు గ్రామాల్లో ఆధార్ ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనెల 22, 23 వ తేదిలలో గాజులపల్లి, సచివాలయంలో, తిమ్మాపురం, బుక్కాపురం 25 వ తేదీలలో సచివాలయాల్లో ఆధార్ స్పెషల్ డ్రైవ్ క్యాంప్ నిర్వహిస్తారన్నారు.