నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని పత్తికొండ బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు దుండగులను కఠినంగా శిక్షించాలన్నారు.