అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల పంట రుణాలు మాఫీ చేసి ఆదుకోవాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పత్తికొండలో ఆమె మాట్లాడారు. పత్తికొండ, మద్దికెర, తుగ్గలి మండలాల్లోని పలు గ్రామాలలో అధిక వర్షాలకు వేలాది ఎకరాలలో పత్తి, వేరుశనగ, సజ్జ, జొన్న, ఆముదం, కంది, టమాట, మిరప పంటలు దెబ్బతిని అన్నదాతలు తీవ్రంగా నష్టపోయి, అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు.