పెద్దకడుబూరు మండలంలోని చిన్న తుంబలంలో త్రాగునీటి కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. చిన్న తుంబలం నుంచి3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాపురానికి వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.