మంత్రాలయం వద్ద ప్రవహిస్తున్న తుంగభద్ర నది ఉద్ధృతిని గురువారం రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులు పరిశీలించారు. హోస్పేట్ డ్యాంలో నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో భారీగా వరద నీరు చేరుతున్నాయి. దీంతో నదిలో స్నానం చేసే భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం సీఐ రామాంజులు, ఎస్ఐ పరమేశ్ నాయక్, టీడీపీ నాయకులు వరదరాజు ఉన్నారు.