కౌతాళం మండలంలో సోమవారం రూ. 2. 5 కోట్ల నిధులతో రోడ్ పనులకు భూమి పూజ చేసిన మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో "పల్లెపండుగ" కార్యక్రమాన్ని మండలంలోని పొదలకుంట, కాత్రికి గ్రామాల్లో నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నూరు రోజుల్లోనే మంచి ప్రభుత్వం అనిపించుకుని, గ్రామాలలో పండుగ వాతావరణాన్ని సృష్టించిందని మంత్రాలయం ఇంచార్జ్ తెలిపారు.