గోనెగండ్ల మండల వ్యాప్తంగా అనేక గ్రామాల్లో విషజ్వరాలు బారిన పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోమవారం గోనెగండ్ల ఆసుపత్రిలో వివిధ అనారోగ్య సమస్యలతో జ్వర పీడితులు భారీగా వచ్చారు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే మండలంలో డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆరోపించారు. సరైన సమయాల్లో వైద్యులు హాజరు కాకపోవడం, వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించకపోవడమే దీని కారణమని స్థానికులు వాపోతున్నారు.