కోడుమూరు: లక్కీ డ్రాలో ఈమెకు రెండు చోట్ల అదృష్టం వరించింది

83பார்த்தது
కోడుమూరు: లక్కీ డ్రాలో ఈమెకు రెండు చోట్ల అదృష్టం వరించింది
కోడుమూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇరువర్గాల ప్రజాప్రతినిధులు కలిసి 129 దరఖాస్తులు ఇవ్వగా సోమవారం లక్కీ డ్రా ద్వారా ఆరు దుకాణాలు దక్కించుకున్నారు. కర్నూలుకు చెందిన ఒక టీడీపీ నేత 10 దరఖాస్తులు ఇవ్వగా, ఒక దుకాణానికి అనుమతి దక్కింది. కె. నాగలాపురం, గూడూరు దుకాణాలు తెలంగాణకు చెందిన సుగాలి లక్ష్మీదేవికే దక్కడం విశేషం. ఈమె పదుల సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా దుకాణాలకు పోటీ పడగా రెండు చోట్ల అదృష్టం వరించింది.

தொடர்புடைய செய்தி