గూడూరు నగర పంచాయతీ పరిధిలో గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్డీవో సందీప్ కుమార్ అన్నారు. గురువారం గూడూరు నగర పంచాయతీ కార్యాలయంలో గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించి, మాట్లాడారు. గూడూరు నగర పంచాయతీ పరిధిలో 920 గృహాలకు గాను 801 గృహాలు పూర్తి కాగా, మిగిలిన 119 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. సమావేశంలో హౌసింగ్ ఈఈ ఎఎల్ ప్రభాకర్, డీఈ వాసుదేవరావు, ఏఈ జమన్న పాల్గొన్నారు.