కోడుమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గాడి రూతమ్మ అధ్యక్షతను గురువారం ఎంపీడీవో రాముడు నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. జిల్లాకు సాగు, తాగునీరు అందించే గాజులదిన్నె ప్రాజెక్టుకు హంద్రీనీవా కాల్వ ద్వారా నీటిని విడుదల చేయకపోవడంలో ఆంతర్యమేంటంటూ జెడ్పీటీసీ సభ్యుడు రఘునాథ్ రెడ్డి జీడీపీ, ఎల్లెల్సీ అధికారులపై మండిపడ్డారు.