కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు పట్టణంలో దారుణ హత్యకు గురైన యువకుడి బోయ రవి కుటుంబ సభ్యులు, మూలగేరి కాలనీవాసులు ఆదివారం గూడూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రవిని హత్య చేసిన నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని ఎస్సై తిమ్మయ్య హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.