డోన్ మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి టి. శివరాం, మండల అధ్యక్షులు పి. రామాంజనేయులు బుధవారం డిమాండ్ చేశారు. డోన్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పెద్దఎల్లయ్య, కుల్లాయప్ప, రామాంజి తదితరులు పాల్గొన్నారు.