గ్రామాల అభివృద్ధి టిడిపి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. సోమవారం ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం గ్రామంలో సోమవారం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ. 40 లక్షల వ్యయంతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమి పూజ నిర్వహించారు. గ్రామాభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని ప్రశంసించారు.