ఆదోనిలోని కుప్పగల్ రైల్వే స్టేషన్లో రైళ్లల్లో ప్రయాణించే కూలీలకు గురువారం అవగాహన కల్పించారు ఆర్పిఎఫ్ ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ లక్ష్మణ్ వారి సిబ్బంది. అనంతరం వారు మాట్లాడుతూ.. రైళ్లలో అనవసరంగా అలారం చైన్లు లాగడం, జనరల్ టికెట్లు తీసుకొని రిజర్వేషన్ కోచ్ లలో ప్రయాణిస్తే జరిమానా విధిస్తామన్నారు. అదేవిధంగా రైళ్లపై రాళ్లు రావడం నేరం అన్నారు. ఈ విషయాలపై కుప్పగల్ స్టేషన్ తో చర్చించి, ప్రయాణికులకు అవగాహన కల్పించామన్నారు.