ఆదోని నుండి రాయచూరుకు వెళ్లే మెయిన్ రోడ్ గుంతల మయంగా మారింది. పెద్ద తుంబలం కోసిగి క్రాస్ వద్ద రోడ్డు గుంతల మయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గురువారం స్థానికులు కోరారు.