ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఛైర్మన్ కేఎస్ రఘు అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. కౌన్సిలర్లు వార్డులో ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్, టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.