ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ప్రధాన లక్ష్యంతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. గత నాలుగు రోజుల నుంచి భారీగా ఆహారం, తాగునీరు పాల ప్యాకెట్లు వస్తున్నప్పటికీ వాటిని సరఫరా చేసే క్రమంలో ఎన్నో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. వీటిని బుధవారం అధిగమించేందుకు ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుండే ప్రజలకు ఆహారం ఏ విధంగా అందించాలని విషయాలపై చర్చించారు.