భవన అనుమతులు జారీ చేసేప్పుడు నిర్మాణ విస్తీర్ణంలో పదిశాతాన్ని స్థానిక సంస్థకు నిర్మాణదారులు తనఖా పెడతారు. ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే ఆ 10 శాతం ప్రాంతాన్ని స్థానిక సంస్థ స్వాధీనం చేసుకుంటుంది. లేదంటే అక్రమంగా నిర్మించినంత వరకు కూల్చేస్తుంది. ఇకపై అనుమతికి మించి అక్రమంగా నిర్మించిన ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకొని బహిరంగ వేలం వేయడానికి స్థానిక సంస్థలకు అధికారం లభించేలా చట్టంలో సవరణ తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.