పారిస్ పారాలింపిక్స్‌లో షాట్‌పుట్‌లో నాగాలాండ్‌కు చెందిన అథ్లెట్ హోకాటో హోటోజే సెమా కాంస్య పతకాన్నిగెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో అతని లైఫ్ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. అతను 18ఏళ్లకే ఆర్మీలో చేరారు. ఆర్మీలో హొకాటో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఈ ఆపరేషన్లలో అతనికి 2002లో ల్యాండ్మైన్ బ్లాస్ట్ జరిగి ఓ కాలు తెగిపోయింది. అయినా నిరుత్సాహపడకుండా క్రీడలపై దృష్టిసారించి పతకాలు సాధిస్తున్నారు. ఆయన నిజమైన యోధుడు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.