కలకత్తాలో వైద్యురాలు హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం మాచవరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన డాక్టర్ హత్యాచార ఘటన దేశమంతా సంచలనం కలిగిస్తోందన్నారు. ఈ ఘటన పై ప్రధాని ఇంతవరకు దీని పై స్పందించకపోవడం బాధాకరమన్నారు