పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురం క్వారీ సెంటర్ లో శ్రీకనకదుర్గమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో మహిషాసురమర్దని అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం దర్శించుకున్నారు. దుర్గమ్మ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రం సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడుస్తుందని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని వేడుకున్నట్లు ఎం.పి తెలిపారు.