జగనన్న విదేశీ విద్యాదీవెన బకాయిలను కూటమి ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పెట్టిన రూ. 1, 778 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను క్లియర్ చేసిందని, అంతేగానీ కక్ష సాధింపులతో విద్యార్థుల జీవితాలతో ఆడుకోలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.