గుంటల మయమైన కోమటికుంట లాకు- తేన్నేరు రోడ్డు నిర్మాణంను వెంటనే చేపట్టాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పంచకర్ల రంగారావు డిమాండ్ చేశారు. బుధవారం కోమటికుంట రోడ్డులో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గతుకుల రహదారిపై ఆటోలు, బైకులు, సైకిళ్లు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతుందని ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.