గుంటూరులోని సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెడనకు చెందిన ఉపాధ్యాయులు అనుముకొండ గౌరీ ప్రసాద్ కు డాక్టర్ ఎ. పి. జె అబ్దుల్ కలాం జాతీయ ప్రతిభా అవార్డును ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆదివారం అందజేశారు. విద్యారంగంలో ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చినందుకు, సామాజిక సేవా కార్యక్రమాలలో చేపట్టినందుకు ఈ అవార్డు లభించినట్లు గౌరీ ప్రసాద్ తెలియజేశారు.