పెడన పట్టణంలో దొంగతనాలు అధికం అయ్యాయని బుధవారం స్థానికులు తెలిపారు. ముఖ్యంగా ఇంటిముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాల్లో పెట్రోలు, ఇంటి ముందు ఉండే నీటి మోటార్లు, సైకిళ్లు, పందెం కోళ్లు, కిరాణా కొట్టులో సరుకులు మాయమవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో బాధితులు వాహనాలకి ప్రత్యేక తాళాలు అమర్చుకుంటున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.