మచిలీపట్నంలో సీఎన్జీ గ్యాస్ కొరత వలన ఉపాధి కోల్పోయిన ఆటోకార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు కృష్ణాజిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీని కోరారు. గత నాలుగు రోజుల నుండి సిఎన్జి గ్యాస్ కొరత వలన ఇబ్బంది పడుతున్న ఆటో కార్మికుల ఉపాధి కాపాడాలని కోరుతూ సోమవారం మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ నుండి ధర్నా చౌక్ లో ర్యాలీ చేసి కలెక్టర్ కు వినతిపత్రం అందించారు.