జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మచిలీపట్నం జిల్లా కోర్టు ప్రాంగణం నుండి జిల్లా కోర్ట్ సెంటర్ వరకు ప్రజలకు న్యాయ సేవా హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు సెంటర్ లో కోర్టు సిబ్బంది మానవహారం నిర్వహించారు. తొలుత జెండా ఊపి ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ప్రారంభించారు.