లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే బాణసంచా అమ్మకాలు జరపాలని మచిలీపట్నం డిఎస్పీ అబ్దుల్ సుభాన్ అన్నారు. రాబోయే దీపావళి పండగ పురస్కరించుకుని మచిలీపట్నం డి. ఎస్. పి కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బందరు సబ్ డివిజన్ పరిధిలో అనుమతి లేని బాణసంచా విక్రయానికి పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.