మచిలీపట్నం: పరిశీలకులను నియమించిన కలెక్టర్

56பார்த்தது
మచిలీపట్నం: పరిశీలకులను నియమించిన కలెక్టర్
కృష్ణా జిల్లాలో మద్యం షాపులకు ఈనెల 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి వేలం పాటలు నిర్వహించుటకు ఎక్సైజ్ స్టేషన్ల వారీగా వివిధ శాఖల జిల్లా అధికారులను పరిశీలకులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మచిలీపట్నంలోని హిందూ కళాశాల పీజీ సెంటర్, ఎంబీఏ బ్లాక్ నందు జిల్లాలో ఎక్సైజ్ స్టేషన్ల వారీగా 8 కౌంటర్లు ఏర్పాటు చేసి, ఒక్కొక్క కౌంటర్ కు పరిశీలకులను నియమించామని తెలిపారు.

தொடர்புடைய செய்தி