గ్రామపంచాయతీలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఎనలేని కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించి జీతాలు పెంచి వారిని ఆదుకోవడంతో పాటు తగిన గౌరవం ఇవ్వాలని సామాజిక కార్యకర్త ఎల్. ఎస్. భాస్కర రావు డిమాండ్ చేశారు. మండవల్లి తహసిల్దార్ కార్యా లయంలో మంగళవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ ఎస్)లో మండవల్లి తహసిల్దార్ కె. గోపాల్ కి వినతిపత్రం అందించారు.