కైకలూరులోని లక్కీ వైన్స్ వద్ద మందుబాబుల కోలాహలం తిరునాళ్లను తలపించింది. కైకలూరు నియోజవర్గంలోని నాలుగు మండలాల్లో బుధవారం రాత్రి కొత్త మద్యం దుకాణాల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ప్రభుత్వ మద్యం దుకాణాలు తొలగించారు. డీడీలు, సరుకు ఇవ్వడం ఆలస్యం కావడంతో రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరుచుకోలేదు. దీంతో ఉదయం నుంచి మందుబాబులు మద్యం కోసం ఎదురుచూపులు చూశారు. దుకాణాల వద్ద బారులు తీశారు.