జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంకు చెందిన యువ న్యాయవాది మూడవత్ రత్నను గౌరవ హైకోర్టులో లా ఆఫీసర్ (అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు) గా ఏపి ప్రభుత్వ న్యాయ కార్యదర్శి నియమించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. యువ న్యాయవాది రత్న మూడవత్ మాట్లాడుతూ తన నియామకంకు సహకరించిన శాసనసభ్యులు శ్రీరాం రాజ గోపాల్, న్యాయ శాఖ మంత్రి, ఐటీ మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబులకు ధన్యవాదములు తెలిపారు.