గుడివాడ టిడ్కో కాలనీ ప్రజల సమస్యలను పరిష్కరించాలని గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము కోరారు. టిడ్కో ఫ్లాట్ల పంపిణీ కార్యక్రమంలో సెంటు స్థలాల మెరకలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిపై విచారణ జరిపించాలని శనివారం అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే రాము ప్రభుత్వాన్ని కోరారు. గుడివాడ టిడ్కో కాలనీలో దుర్భర పరిస్థితులను ఫోటోల రూపంలో అసెంబ్లీలో ప్రదర్శించి ప్రజల కష్టాలపై మాట్లాడారు.