వచ్చే దసరా నాటికి నియోజకవర్గంలో నూరు శాతం సీసీ రోడ్లు నిర్మిస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శనివారం చల్లపల్లి మండలం ఆముదార్లంకలో నూరు శాతం సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఉపాధి నిధులు రూ. 85. 70 లక్షలతో 1500 మీటర్లు పొడవైన 17 సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. దాతలు నిర్మించిన వాటర్ ప్లాంట్ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రారంభించారు.