ఇంద్రకీలాద్రిపై కొలువైన వేద స్వరూపిణికి దుర్గాష్టమి రోజున వేద పండితులు మంత్రాభిషేకం వైభవంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి వేద పండితులు వచ్చారు. ఇంద్రకీలాద్రి ఆలయంలోని శ్రీ మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో శుక్రవారం సాయంత్రం వేదసభ జరిగింది.