విజయవాడ వరద బాధితులకు వస్త్ర వితరణ చేసేందుకు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. మంగళవారం తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ప్రతినిధి కళ్యాణ్ చక్రవర్తి వరద బాధితులకోసం 5వేల వస్త్రకిట్లను విజయవాడ తీసుకొచ్చారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి కిట్ ను చూపించారు. ఒక్కో కిట్ లోదుప్పటి, కండువా, చీర, పంచె ఉంటాయని ముఖ్యమంత్రికి తెలిపారు. అధికారుల ద్వారా వరద బాధితులకు పంపిణీ చేయనుంది.