తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై శుక్రవారం ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భాంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే లైంగిక దాడులపై విచారణ జరిపించాలన్నారు. ఆయన రౌడీ దౌర్జన్యాలు నశించాలంటూ పలువురు ధర్నాచేశారు. ఎమ్మెల్యే గ్రావెల్ దందా, రేషన్ స్కామ్‌లకు అడ్డు వస్తున్నామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆయనపై పార్టీ చర్యలు తీసుకోవాలి' అని వారు డిమాండ్ చేశారు.